తొలి అడుగు కాదు…ఇదే చివరి అడుగు”
1 min read

చంద్రబాబు మోసాలకు ప్రజల తిరుగుబాటు జోరుగా వెల్లువెత్తింది
పట్టణ పార్టీ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప అధ్యక్షతన, 9వ వార్డు కౌన్సిలర్, రాష్ట్ర సాంకృతిక విభాగ ప్రధాన కార్యదర్శి పి.రాజరత్నం, 10వ వార్డు కౌన్సిలర్ సుధాకర్
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లో విప్పిచెప్పుతూ వైసీపీ నాయకులు ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతున్నారు.ఇందులో భాగంగా 2025, ఆగస్టు 1వ తేదీన ఎమ్మిగనూరు పట్టణంలోని 9వ, 10వ వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు, పట్టణ పార్టీ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప అధ్యక్షతన, 9వ వార్డు కౌన్సిలర్, రాష్ట్ర సాంకృతిక విభాగ ప్రధాన కార్యదర్శి పి.రాజరత్నం మరియు 10వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ‘సుపరిపాలన తొలి అడుగు’ పేరిట మళ్లీ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలు తక్కువ కాలంలోనే మోసాన్ని గుర్తించారని, ఇది వారి తొలి అడుగు కాదు – చంద్రబాబు రాజకీయ జీవితానికి చివరి అడుగేనని అన్నారు. గత ఏడాది కాలంగా అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రారంభించని కూటమి ప్రభుత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలైన పథకాలను నిలిపివేసి ప్రజలను తీవ్రంగా దెబ్బతీసిందని మండిపడ్డారు.ప్రజల నడ్డి విరిచే విధంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన విధానం కూటమి మోసానికి నిదర్శనమని చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ప్రతి రైతుకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించిన రైతు భరోసా పథకాన్ని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవగా పేరు మార్చి అసలు విధేయతను ఖాళీ చేసినట్లుగా ప్రవర్తిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల కొరత, ఎరువుల వ్యాపారాల్లో అవినీతి, పంటలకు గిట్టుబాటు ధరల కల్పన లేకపోవడం రైతులను అప్పుల్లోకి నెట్టేస్తోందని వాపోయారు.అంతేకాక, ఎమ్మిగనూరు పట్టణాభివృద్ధి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ వల్లే సాధ్యమైందని, ప్రస్తుతం ఇంకా 8 నెలలపాటు కౌన్సిల్ కొనసాగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు పట్టణ మునిసిపల్ వైస్ చైర్మన్ డి.నజీర్ అహమ్మద్,జిల్లా చేనేత అధ్యక్షులు యం.కె.శివ,జిల్లా అధికార ప్రతినిధి కదిరికోట సునీల్ కుమార్,ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి జి.చిన్న,జిల్లా అంగన్వాడి విభాగ కార్యదర్శి సావిత్రమ్మ,పట్టణ బిసి సెల్ అధ్యక్షులు బోయ బజారి,పట్టణ మైనారిటీ విభాగ అధ్యక్షులు ముళ్ల రసూల్,పట్టణ మహిళ అధ్యక్షురాలు లతారెడ్డి,పట్టణ డాక్టర్ విభాగ అధ్యక్షులు యూసూఫ్,పట్టణ ఉపాధ్యక్షులు బి.బజారి రెడ్డి,కోటకొండ నరసింహులు,పట్టణ కార్యదర్శిలు గురువ మా భాష,జేరుబండి రఘువీర,చాకలి నరేష్ , పట్టణ కార్యవర్గ సభ్యులు గుడికల్ అల్తాఫ్,రెండవ వార్డ్ ఇంచార్జ్ చంద్ర,31వ వార్డు ఇంచార్జ్ పాల శ్రీనివాసరెడ్డి,వార్డు నాయకులు టీకే గౌస్,బడే సాబ్,షరీఫ్,జి.వీరారెడ్డి,సోసియల్ మీడియా జిల్లా కార్యదర్శి కదిరికోట రాజ్ కుమార్,సభ్యులు జశ్వంత్,వార్డు నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

