NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు కాల్వకు కలెక్టర్,ఎమ్మెల్యే రాక..

1 min read

అభివృద్ధి పనులకు భూమి పూజ..

ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్​ నేడు  : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వ గ్రామానికి ఈరోజు మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష మరియు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి రానున్నారు. కాల్వ గ్రామంలోఉ10 గం.లకు నూతనంగా నిర్మిస్తున్న (ఓహెచ్ఎస్ఆర్) త్రాగునీటి ట్యాంక్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ రానున్నారు.ఈ ట్యాంక్ నిర్మాణానికి ప్రత్యేక పూజలతో కలెక్టర్,ఎమ్మెల్యే ఈ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.ఆ తర్వాత ఉ10:30 కు హుస్సేనాపురం గ్రామంలో  రైతు సాధికార సంస్థ,ప్రకృతి వ్యవసాయ వనరుల ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభోత్సవంలో వారు పాల్గొననున్నారు.సా 5 గం.లకు కల్లూరు అర్బన్ 19 వ వార్డ్ జోహారాపురం రోడ్ నందు నూతన నగర పాలక సంస్థ వారి పెట్రోల్ మరియు డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.

About Author