యూరియా కొరత తీర్చండి…
1 min read

వ్యవసాయాధికారులను కోరిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి….
ఆలూరు న్యూస్ నేడు : జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గంలో రైతులకు ఎంతగానో అవసరమైన యూరియా కొరత అధికంగా ఉందని, రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అవసరమైన మేర యూరియా లభించడం లేదని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి వ్యవసాయ అధికారులను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం లో హోళగుంద, హాలహర్వి తదితర మండలాల్లో ప్రస్తుతం రైతులు వరి పంట సాగు చేస్తున్నారని,వరి సాగు చేసిన రైతులకు అధిక మోతాదులో యూరియా ఆవశ్యకత ఉంటుందని అన్నారు.కానీ రైతుల అవసరానికి సరిపడా యూరియా అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతులకు సరిపడా యూరియా అందించడానికి వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

