జిల్లా ప్రొహిబిషన్ .. ఎక్సైజ్ అధికారుల దాడులు…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం. సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ నేరముల నిమిత్తం కర్నూలు పరిసర ప్రాంతాలలో దాడులు చేస్తూ ఉండగా రాబడిన సమాచారం మేరకు తిరుమలగిరి టౌన్ షిప్ వద్ద నగేష్ రావు మాజీ ఆర్మీ అధికారి ఇంటిలో డిఫెన్స్ లిక్కర్ ఉందన్న సమాచారం మేరకు అతని ఇంటిని తనిఖీ చేయగా సుమారు 53 బాటిళ్లు ఉండినవి వాటిని పరిశీలించగా ఆర్ముడు పేరా మిలిటరీ ఫోర్సెస్ ఆర్మీ పర్సనల్ కు మాత్రమే అమ్మబడును అని ఉంది. కావున వీటిని ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు అని అడగగా బెంగళూరులోని ఆర్మీ క్యాంటీన్ నందు తీసుకొని ఇక్కడ అధిక రేటుకు అమ్మడం కొరకు తెచ్చినట్లుగా పేర్కొన్నాడు. కావున వాటిని పరిశీలించి చూడగDewars విస్కీ 18Block dog gold 12 బ్లాక్ డాగ్ బ్లాక్ 12 రాక్ఫోర్డ్ 11 మొత్తం 53 బాటిళ్లు ఉండినవి. వాటిని సీజ్ చేసి స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపడమైనది. ఈ దాడులలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్, ఎస్సై రెహానా బేగం సిబ్బంది రామలింగ, చంద్రపాల్, మధు కిషోర్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈ ఎస్ టి ఎఫ్ రాజేంద్రప్రసాద్ ఎస్ఐ ఇంద్ర కిరణ్ తేజ సిబ్బంది రాణి,బషీర్,లాలప్ప తదితరులు ఉమ్మడిగా దాడులు చేసి పట్టుకోవడం జరిగింది.

