కేంద్ర సాయుధ బలగాల కవాతు (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) ర్యాలీ
1 min read

శాంతియుత వాతవారణం , ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించేదుకే ఈ ర్యాలీ.
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు శనివారం కర్నూలు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణంలో భాగంగా ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించేందుకే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కేంద్ర సాయిధ బలగాలు , కర్నూలు పట్టణ పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు.కర్నూలు కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ , కిడ్స్ వరల్డ్ , పూల బజారు, గాంధీ చౌక్ , మించిన్ బజార్, కాంగ్రెస్ ఆఫీసు మీదుగా కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. స్నేహ పూర్వక వాతావరణం నెలకొల్పెందుకు, ప్రజలకు ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే తక్షణ సాయం అందిస్తామని, రానున్న వినాయకచవితి , స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.ఈ ర్యాలీ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ శ్రీ విజయ్ కుమార్ వర్మ, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ పాపరావు కీర్తి, ఇన్ స్పెక్టర్లు బి. రాజు, భారతి, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజ రావు, శేషయ్య , మన్సురుద్దీన్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు సిబ్బంది పాల్గొన్నారు.

