NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు..

1 min read

సమస్యలను నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి

నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి..

నంద్యాల  , న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించరాదని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పిజిఆర్ఎస్ సమస్యలపై నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత గడువు లోపు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార  వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్,జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్  ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో  ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తుందని ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా వేగవంతంగా పరిష్కరించి న్యాయం చేయాలన్నారు.స్వీకరించిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ పంపాలన్నారు..కానాల గ్రామానికి చెందిన షేక్ ఖాజాబీ తన కుటుంబానికి చెందిన హౌసింగ్ మ్యాపింగ్ లో గుర్తు తెలియని వ్యక్తిని చేర్చడంతో తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని వెంటనే ఇతనిని మా హౌసింగ్ మ్యాప్ నుంచి తొలగించాలన్నారు.వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు.ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author