NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమస్యల పరిష్కారంకోసం పోరాటాలకు సిద్ధం కండి 

1 min read

నారాయణ స్వామి. సిఐటియు జిల్లా కార్యదర్శి 

పత్తికొండ , న్యూస్​ నేడు : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులంతా పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణస్వామి జిల్లా నాయకులు చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఈశ్వర్ రెడ్డి భవన్ నందు సిఐటియు మూడవ మండల మహాసభలు జరిగాయి మండల మహాసభల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నారాయణస్వామి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపై పనిభారం పెడుతూ పని గంటల సమయాన్ని పెంచడానికి అదేవిధంగా నిరుద్యోగ సమస్యలు రూపుమాపణలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోగా నిర్బంధంగా వ్యవహరిస్తుందని తెలిపారు.  రాబోయే కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు పిలుపులను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు కన్వీనర్ గా ఎం. రవిచంద్ర కో- కన్వీనర్ గా గోపాల్, కోశాధికారిగా ప్రభాకర్, సహాయ కార్యదర్శిగా నరసన్న, కార్య వర్గ సభ్యులుగా లక్ష్మి, అంజనమ్మ, శ్రీనివాసులు, రామాంజనేయులు, పావని, ఈశ్వరమ్మ, కమిటీ సభ్యులుగా ఉరుకుందు, సావిత్రిబాయి, శ్రీనివాసులు, మోహన్, దుగ్గెన్న, హుస్సేన్, నడిపి రంగన్న, నాగేంద్ర, సురేంద్ర, లను   ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా మరో 10 మందిని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మాజీ నాయకులు దస్తగిరి సిద్దయ్య గౌడ్, రంగారెడ్డి, పిఎన్ఎం జిల్లా నాయకులు పెద్ద కాశన్న, రమేష్, మద్దికేర మండలం సిఐటియు నాయకులు రాముడు, డివైఎఫ్ఐ దుగ్గెన్న, జయప్రకాశ్ రెడ్డి, అల్లిపిర, పుచ్చకాయల మాడ రైతు సంఘం ఆదినారాయణ, కార్పెంటర్ యూనియన్ నాయకులు హుస్సేన్ సాహెబ్, కాశీనాథ,తదితరులు పాల్గొన్నారు.

About Author