సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాసులు రెడ్డిని సన్మానించిన టిడిపి నాయకులు
1 min read

చెన్నూరు , న్యూస్ నేడు : చెన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా నియామకమైన ముండ్ల శ్రీనివాసులరెడ్డిని మంగళవారం మండలంలోని ఓబులంపల్లి గ్రామంలో ఆయన నివాసంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. శ్రీనివాసులు రెడ్డిని సన్మానించిన వారిలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు అల్లాడు రాజశేఖర్ రెడ్డి. జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి వేల్పుల సుబ్రహ్మణ్యం. యువ నాయకుడు మహేశ్వర్ రెడ్డి. ఐ టి డి పి సమన్వయకర్త యామల మణికంఠ పలువురు సన్మానించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు విలువలు ఉంటాయని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు సంపూర్ణమైన మద్దతును పార్టీ అధిష్టానం ఇవ్వడమే కాకుండా మంచి గుర్తింపు పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ముండ్ల శ్రీనివాసరెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి సింగిల్ విండో చైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. శ్రీనివాసులు రెడ్డిని చైర్మన్ గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి. కమలాపురం శాసనసభ్యు. పుత్త కృష్ణ చైతన్య రెడ్డి లకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.

