ఉపాధి హామీ నిధులతో పత్తికొండ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలి
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: ఉపాధి హామీ పథకం నిధులతో పత్తికొండ నియోజకవర్గం ప్రాంతాన్ని అభివృద్ధి కోసం పాటుపడాలని స్థానిక ఎమ్మెల్యే కేఇ శ్యామ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పత్తికొండ నియోజకవర్గం లో ఉపాధి హామీ పథకం ద్వారా అమలవుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా అమలు అవుతున్న పనులతో నియోజకవర్గన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే డ్వామా ఎపిడి లక్ష్మన్న ను ,పంచాయితీరాజ్ డిఇ శేషయ్య ను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిడి లక్ష్మన్న గ్రామీణ రహదారులు, పండ్ల తోటల పెంపకం, గోకులంషెడ్లు, 2014-2019 మద్యకాలంలో జరిగిన పెండింగ్ పేమెంట్ ను పూర్తి చేశామని ఎమ్మెల్యే కు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఏపిఒలు , ఏఇ లు హాజరయ్యారు.

