NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వర్షం నీరు పోయే దారి లేక అరుంధతి నగర్ వాసుల ఇక్కట్లు

1 min read

ఇప్పటికే విష జ్వరాలతో అలా అడుగుతున్న వైనం

పట్టించుకోని పంచాయతీ అధికారులు

చెన్నూరు, న్యూస్ నేడు : కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు ఇండ్ల చుట్టూ రోడ్లలో నిలవడంతో  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే వర్షపు నీరు పోయే దారి లేక నీరు నిలువ ఉండడం తో దోమల బెడద వల్ల అంటు రోగాలు ప్రబలుతున్నాయని, ఇప్పటికే వాంతులు, వీరేచనాలతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి బాట పట్టడం జరిగిందని ఈ విషయమై స్థానిక పంచాయతీ కార్యాలయంలో తమ గోడు ను విన్నవించుకున్నప్పటికీ పంచాయతీ అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేదని వారు వాపోయారు. అటు పంచాయతీ అధికారులు నేషనల్ హైవే అధికారులకు చెప్పాలని సూచించడం జరిగిందని అయితే నేషనల్ హైవే అధికారులు పంచాయతీ అధికారులకే చెప్పుకోండని చెప్పడం జరిగిందని అక్కడ ప్రజలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే విస్తరణలో భాగంగా తమ ఇళ్లను స్థలాలను నేషనల్ హైవే అధికారులు తీసుకోవడం జరిగిందని అయితే ఇక్కడ సక్రమంగా సర్వీస్ రోడ్డు గాని డ్రైనేజీ కానీ నిర్మించకపోవడంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక తమ ఇండ్ల చుట్టూ రోడ్లలో నిలువ ఉండడంతో తాము అనేక విధాలుగా ఇబ్బందులు పడడమే కాకుండా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని అక్కడ ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అధికారులను అర్థిస్తున్నారు.

About Author