మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ ఐదు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమం కర్నూలులోని టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో మరియు ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో మరొక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాల్లో భాగంగా డ్రగ్స్ గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించి పూర్తి అవగాహనను కల్పించే ఉద్దేశంతో కళాశాల అధ్యాపకుల సహాయంతో కళాశాల విద్యార్థులకు తెలియజేసి మరియు వాటి వలన వచ్చు అనర్థాల గురించి వివరించి వాటి యొక్క ఉపయోగము ఉపయోగించడం వల్ల కలిగే కష్టనష్టాల గురించి మరియు వాటి వలన మనిషి యొక్క ఆరోగ్యం పై పడే ప్రభావాన్ని తెలియజేసి వాటికి దూరంగా ఉండాలని సమాజంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా వ్యసన బారిన పడినట్లయితే అటువంటి సమాచారాన్ని అందించాలని తెలియజేయడమైనది తదుపరి కార్యక్రమంలో భాగంగా రెండు వేరు వేరు చోట్ల ప్రతిజ్ఞను కూడా తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి పి శ్రీదేవి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి రవికుమార్ నంద్యాల, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి సిఐ లు చంద్రహాస్,సుభాషిని తో పాటు ఈగల్ టీం కన్వీనర్ సృజన్ కుమార్ మరియు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్ జలగంగాధర్ పాల్గొన్నారు.

