కర్నూలు జీజీహెచ్లో కిడ్నీ మార్పిడి విజయవంతం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి యందు ఇప్పటి వరకు 5 ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేశామని అన్నారు.కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల యందు గత నెల 17 న డయాలసిస్ రోగికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశామని సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఇందుకు కృషి చేసిన అవయవ దాత కుటుంబానికి, యూరాలజీ, నెఫ్రాలజీ, అనస్థీషియా విభాగపు వైద్యులకు అభినందనలు తెలిపారు. మంగళవారం సూపరింటెండెంట్ కార్యాలయంలో యందు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించు కుంటూ ఉన్న వ్యక్తి “జీవన్ దాన్” లో రిజిస్ట్రేషన్ చేయించు కోవడం ద్వారా అతనికి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కిడ్నీ జీవందాన్ ద్వారా అలాట్ చేయడం జరిగింది.
పేషెంట్ సంబంధించిన డీటెయిల్స్
తరుణ్ 21/M కొత్తబనుక చర్ల (V) పాములపాడు (మం) కర్నూలు నివసికి యాక్సిడెంట్ అవ్వడంతో కర్నూలు మెడికవర్ హాస్పిటల్ లో 09/జులై/2025 చికిత్స పొందుతూ 16వ తేదీన బ్రెయిన్ డెత్ అయిన పేషంట్ కి జీవనదాన్ వెబ్ సైట్ యందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న పేషెంట్ అయిన గుర్రం గిరిధర్ 22/M కరివేముల (v), దేవనకొండ,(M), కర్నూలు ఆయన పేషంట్ కి 16/07/2025 తేదీన అడ్మిషన్ చేసి కిడ్నీ సర్జరీ 17/07/2025న అతనికి ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్పరెంట్ చేయడం జరిగిందని సదరు వ్యక్తి చక్కటి ఆరోగ్యంతో ఉన్నారని, ప్రజలకు అవయవదానంపై అవగాహన అవసరమని మరణంలో కూడా మరో 6,7 మందికి ప్రాణదానం చేయొచ్చని తెలిపారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ కొరకు అవసరం ఉన్నవారు జీవనదాన్ వెబ్ సైట్ యందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులను సంప్రదించడం మంచిది కాదని జీవన్ దాన్ వ్యవస్థ అంతా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశామని అని అన్నారు.అవయవ దానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అని అన్నారు అందుకే అన్ని దానాల్లోకెల్లా అవయవదానం గొప్పది అని అన్నారు.ఈ కార్యక్రమంలో నెఫ్రాలజీ విభాగపు వైద్యులు డా. జిక్కి, డా.అనంత్, డా.వెంకటప్పకి రెడ్డి, డా.శ్రీధర్ శర్మ, యూరాలజీ ఇన్చార్జి ప్రొఫెసర్, డా. ముత్యశ్రీ, డా.బాల రవితేజ, ఆసుపత్రి ఇన్చార్జి సి ఎస్ ఆర్ ఎం ఓ, డా.వెంకటరమణ, డిప్యూటీ సి.ఎస్.ఆర్ ఎం ఓ, డా.పద్మజ, అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రహ్మణ్యం, అనస్థీషియా విభాగపు హెచ్ఓడి, డా.విశాల, అనస్థీషియా ప్రొఫెసర్, డా.రామ్ శివ నాయక్, హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్, డా.శివబాల, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా.కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

