NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గీత కార్మికులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది..

1 min read

రాష్ట్రంలో గీత కార్మికుల కోసం340 మద్యం షాపులను కూటమి ప్రభుత్వం కేటాయించింది

లైసెన్స్ ఫీజులో కూడా 50% రాయితీ

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

గౌడ సంఘానికి బార్ నిర్వహణకు నా పూర్తి సహకారం అందిస్తా

ముఖ్యమంత్రికి,ఉప ముఖ్యమంత్రి కి పాలాభిషేకం

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అని, నేడు గ్రామ సర్పంచుల నుండి చట్టసభల వరకు బీసీలు ప్రాతినిధ్య వహిస్తుండటంలో స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు చేసిన కృషి ఎనలేనిదని, రాష్ట్రంలో గీత కార్మికుల కోసం 340 మద్యం షాపులను కూటమి ప్రభుత్వం కేటాయించిందని, అలాగే వాటికి లైసెన్స్ ఫీజులో కూడా 50% రాయితీ ఇవ్వడం జరిగిందని,  అంతేకాకుండా దెందులూరు నియోజకవర్గంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బార్ నిర్వహణకు కూడా తాను పూర్తి సహకారం అందిస్తానని, దాని ద్వారా వచ్చే లాభాలను సైతం గౌడ సంఘం ప్రజల సంక్షేమానికే వినియోగించుకునేలా చర్యలు చేపడతామని” దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.మారుతున్న కాలంలో కులవృత్తులు మసకబారి ఇబ్బందులు పడుతున్న కల్లు గీత కార్మికులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ నూతన మద్యం విధానంలో మార్పులు తీసుకువచ్చి గీత కార్మికులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాలులో జరిగిన ధన్యవాద సభలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా గీత కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి చంద్రన్న బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నామని, అయితే గత వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు ఇస్తామని ప్రకటించి 47 మంది గీత కార్మికులు చనిపోతే కనీసం వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఇది బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణికి నిదర్శమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. 50 ఏళ్లకే గీత కార్మికులకు పెన్షన్ అందించే తెలుగుదేశం పార్టీ ఆ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించిందని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో కేటాయించబడే బార్ను సైతం గౌడ సంఘీయులకు చెందేలాగా అది కూడా ఎక్కడా కూడా బినామీ పేర్ల మీద గీత కార్మికులను అడ్డుపెట్టి మద్యం వ్యాపారాలు చేసేటు వంటి వ్యక్తుల చేతికి ఇవి చేజారకుండా పారదర్శకంగా కల్లుగీత కార్మికులకు మాత్రమే కేటాయించబడిన వైన్ షాపులు బార్లను వారే నిర్వహించుకునే లాగా వాటి లాభాలను కూడా వారి సంక్షేమానికే ఉపయోగించుకునే లాగా తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని దెందులూరు ఎమ్మెల్యేచింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ పలువురు ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, కూటమి నాయకులు, గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author