జిల్లా టిడిపి కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
1 min read

పాల్గొన్న జిల్లా అధ్యక్షులు,ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు,ఎమ్మెల్యే బడేటి చంటి,మేయర్ షేక్ నూర్జహాన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : దేశ స్వయం ప్రతిపత్తిని, భారతీయుల భవిష్యత్తును కాపాడేందుకు ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు,ఏపి ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న వారు నగర మేయర్ నూర్జహాన్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు . ప్రజలు కూడా ఈ ఆశయ సాధనకు బాసటగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్, ఏపి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, టిడిపి నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం, సెక్రటరీ రెడ్డి నాగరాజు కో – ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, పలువురు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్చార్జులు, డివిజన్ ఇన్చార్జులు, కార్యకర్తలు, మహిళలు, వివిధ హోదాలో ఉన్న అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

