పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ సత్కారం
1 min read

ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :జాస్తిహరినాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా బృందావనం పార్క్ ఆవరణలో జెండా వందనం ఘనంగా జరిగింది. నాడు గాంధీ మహాత్ముని పిలుపుమేరకు పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, పర్యావరణ సంరక్షణను వివరిస్తూ మనకు నిత్యం పారిశుద్ధ్య సేవలందిస్తున్న ఏలూరు నగరపాలక సమస్త లో పారిశుద్ధ్య విభాగంల్ అత్యుత్తమ సేవలు అందించిన నరమామిడి నాగమణి మరియు ఉయ్యాల గోపాలరావు కి అసోసియేషన్ తరపున పూలమాలలు వేసి. శాలువాలు కప్పి ఆత్మీయ సత్కారo చేశారు.ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ మామిళ్ళ రాఘవేంద్రరావు, కార్యదర్శి మరక భుజంగారావు, కోశాధికారి మాడ మల్లికార్జునరావు మరియు ఫాస్ట్ గవర్నర్ ఐఎమ్ఆర్ మోహన్ రావు, కార్యవర్గ సభ్యులు మరియు వాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

