సండేల్ చంద్ర శేఖర్ కు సన్మానం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు:స్వాతంత్ర్య సమర యోధులలో ఒకరైన ఎస్.డి. నారాయణ రావు కుమారుడు సండేల్ చంద్ర శేఖర్ కు శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వాణిజ్య, ఫుడ్, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ , కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పటేల్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సండేల్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ తన తండ్రి ఎస్.డి. నారాయణ తొమ్మిదేళ్ల వయస్సు నుంచి పోరాట యోధులతో తిరిగే వాడని, ఇంటి నుంచి బయటకు వెళ్లి క్విట్ ఇండియా, విదేశీ వస్తువుల బహిష్కరణ తదితర ఉద్యమాలు చేశారని గుర్తు చేసుకున్నారు. దక్షిణ కేంద్రం కర్ణాటకలోని మూడు బిద్ర తాలూకాలోని సండేల్ గ్రామంలో తన తండ్రి జన్మించారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే సమయంలోనే సండేల్ అనే గ్రామం పేరు … ఇంటి పేరుగా ప్రజలు పిలిచారని, అప్పటి నుంచి సండేల్ నారాయణ రావుగా మారిందన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలను సన్మానించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సండేల్ చంద్ర శేఖర్ తెలిపారు.

