ఉచిత మెగా ఆర్థో వైద్య శిబిరం విజయవంతం..
1 min read

50 మందికి పైగా వైద్య పరీక్షలు చేసిన డా. రవితేజ రెడ్డి
- ఘనంగా శిరీష పాలి క్లినిక్ 3వ వార్షికోత్సవం
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరం ఎన్. ఆర్ పేట లోని శిరీష పాలి క్లినిక్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉచిత మెగా ఆర్థో వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎముకలు, నరములు, వెన్నెముక మరియు కీళ్ల మార్పిడి శస్ర్త చికిత్స వైద్య నిపుణులు డా. ఎస్. రవి తేజ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరంలో దాదాపు 50 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరంలో భాగంగా పి.ఆర్.పి. థెరపి, రేడియో ఫ్రీక్వెన్సి అబ్లెషన్ థెరపి, మోకాళ్ల కీళ్ల మార్పిడి( ఫాస్ట్ ట్రాక్ పద్దతి ) ఆర్ర్థో స్కోపి, ఫ్రాక్చర్ మేనేజ్ మెంట్, తుంటి కీళ్ల మార్పిడి తదితరవి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన పేద వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్థో పెడిక్ వైద్య నిపుణులు డా. ఎస్. రవి తేజ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలోనే మొదటి సారిగా ఇంటర్వెన్షనల్ ఆర్థో పెడిక్ వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. శిరీష పాలి క్లినిక్ స్థాపించి మూడేళ్లవుతుందని, ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉచిత మెగా ఆర్థో వైద్య శిబిరం నిర్వహించామని, ఇందులో రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, రాయచూరు, మహబూబ్ నగర్ , గద్వాల జిల్లాల నుంచి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాక ఎముకల సాంద్రత పరీక్ష ( బిఎండి), ఫుట్ సెన్సిటివిటి పరీక్ష ఉచితంగా చేసినట్లు వెల్లడించారు. సాయంత్రం శిరీష పాలి క్లినిక్ మూడో వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సిబ్బందికి, రోగులకు పంచారు.


