విద్యార్థులకు నగదు బహుమతి
1 min read

హొళగుంద, న్యూస్ నేడు: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో 2024– 25 విద్యా సంవత్సరంలో పది టాపర్ గా నిలిచిన గ్రామానికి చెందిన విద్యార్థులకు జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు ఆధ్వర్యంలో నగదు బహుమతి అందజేశారు. అసోసియేషన్ సభ్యుడు సిపాయి గంగాధర్ చేతుల మీదుగా మొదటి బహుమతిగా రూ. 10వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 5వేలను ప్రతిభ చూపిన విద్యార్థులకు అందజేశామని, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

