NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దివ్యాంగుల ధర్నాకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే..

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  ఆలూరు మండలం కేంద్రంలో వికలాంగుల పెన్షన్ తొలగింపు పైన అంబేద్కర్ సర్కిల్ నందు వికలాంగుల ధర్నా కు మద్దతూ తెలిపిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక సమస్య పైన పోరాడుతూనే ఉన్నానని అన్నారు. అర్హులుగా ఉన్న వికలాంగులకు పెన్షన్ లను  అనర్హులుగా  నోటీసులు ఇవ్వడం చాలా నీచమైన పని అని అన్నారు. సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు  వికలాంగుల పెన్షన్ తీసివేయండి అని చెప్పడం చాలా దుర్మార్గం అన్నారు.వికలాంగుల పెన్షన్ నోటీసులు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా  మాకు పెన్షన్ మాళ్ల రాకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని నాతో చెప్తున్నారు. పెన్షన్ పెంచామని మేము ఏమైనా అడిగినామా అందరిపాటు మాకు కూడా 4000 రూపాయలు చాలు అని చాలా మంది వికలాంగుల మాట్లాడుతున్నారు. నేను పార్టీలకతీతంగా మీ తరపున పోరాడడానికి ఎంత దూరమైనా వస్తానని చెప్పడం జరిగింది. తొలగించిన పెన్షన్ ను ఇవ్వకపోతే నేను పోరాడుతూనే ఉంటానని అన్నారు.ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు చంద్రబాబు రాబోయే రోజుల్లో ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. వికలాంగుల తరఫున నేను  నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తొలగించిన పెన్షన్  ఇవ్వకపోతే జిల్లా వికలాంగులతో అందరితో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయని ముట్టడిస్తామని తెలియజేశారు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author