ఉపాధ్యాయుడి దాతృత్వం..
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని క్రింది గేరి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న జి. హరినాధ రెడ్డి తన దాతృత్వంతో మరొక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న ఆయన, ఈసారి పాఠశాల విద్యార్థులందరికీ గుర్తింపు కార్డులను ఎంఈఓ వెంకటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో అందజేశారు.ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి సేవా కార్యక్రమాలు శ్లాఘనీయమని మండల విద్యాధికారులు, పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి మరియు మహేశ్వర్ రెడ్డి,ఎస్ఎంసి చైర్మన్ ప్రసాద్ మరియు ఉపాధ్యాయులు లక్ష్మీ,గురువర్ధిని తదితరులు పాల్గొన్నారు.

