NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుక..

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 54 వ జన్మదిన వేడుకలు మిడుతూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో డిప్యూటీ సీఎం వీరాభిమానిబోయ బాల రాముడు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సుంకులమ్మ గుడి దగ్గర పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.అమ్మవారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కు ఉండాలని వారు కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు దేవుడు అన్ని విధాలుగా డిప్యూటీ సీఎం కు తోడుగా ఉండాలని వారు కోరారు.అదేవిధంగా గుడిపాడు నుండి దేవనూరు రోడ్డు వైపున జనసేన గుడిపాడు ప్రభాకర్ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో శివ,మధు, మాబు వలి,శాలు భాష,మధు వెంకట్ తదితర యువకులు పాల్గొన్నారు.

About Author