ఏపీ ఈపీడీసీఎల్ సిఎండి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
1 min read

విద్యుత్ సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని వినతి
సానుకూలంగా స్పందించిన సీఎం డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ , ఏపీ ఈపీడీసీఎల్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఇమ్మడి. పృధ్వీ తేజా ఐఏఎస్ ని ఏలూరులోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు.కార్పొరేట్ రంగంలో భారీ స్థాయిలో ప్యాకేజీ జీతాలు వస్తున్నా కూడా వాటిని వదులుకొని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచిన ఉత్తమ అధికారిగా ఎదిగిన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన ఇమ్మడి పృద్వితేజ ఆశయం యువతకు స్ఫూర్తిదాయకమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొనియాడారు.అదేవిధంగా దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ సిబ్బంది కొరత సహా పలు విద్యుత్ శాఖ సమస్యలపై పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎండి కి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. సత్వరమే సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా సిఎండి పృథ్వితేజ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి తెలియజేశారు. సీఎండి తో ఈపీడీసీఎల్ ఏలూరు జిల్లా ఎస్ఇ సాల్మన్ రాజు సిబ్బంది ఉన్నారు.


