NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా టీచర్స్ డే వేడుకలు…

1 min read

హొళగుంద న్యూస్ నేడు : సమసమాజ స్థాపనకు గురువు మార్గదర్శకత్వం ఎంతో అవసరండా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతినే నేడు మనం గురుపూజోత్సవం (టీచర్స్ డే)గా జరుపుకుంటున్నామన్నారు.సమసమాజ స్థాపనకు గురువు మార్గదర్శకత్వం ఎంతో అవసరమని మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కబీర్ సాబ్ అన్నారు. సందర్భంగా గురువారం గురుపూజోత్సవం (టీచర్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత ఏర్పాటు చేసిన ముందస్తు వేడుకలలో ఆయన ఉపాధ్యాయ బృందంతో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని, విద్యార్థులు గురుపూజోత్సవం సందర్భంగా కేకులను కట్ చేసి ఉపాధ్యాయులకు తినిపించారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి మొమెంటోలను అందజేశారు. గురువుల ఆవశ్యకత మరియు ప్రాముఖ్యతపై విద్యార్థులకు వారు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు కబీర్ సాబ్ కొనియాడి, వారి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ, గురువు లేనిదే ఏ ఒక్కటీ సాధ్యపడదని, అందుకే గురువు లేని విద్య గుడ్డి విధ్య అన్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ ద్వారకానాథాచారి, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్ధులు. తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author