NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కాంగ్రెస్ పార్టీ గళం

1 min read

ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాలు కబ్జా

రిసర్వే తో నిజాలు బయటపడం తొలి విజయం

పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ భూముల ఎకరాలకొద్దీ ఆక్రమణలపై కాంగ్రెస్ పార్టీ గళం వినిపించినందుకే రీసర్వే తో నిజాలు బయటపడటం తొలి తమ విజయమని కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జి క్రాంతి నాయుడు తెలిపారు. శనివారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పత్తికొండ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్లపై పత్తికొండ కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పటి నుండో మేము నిరంతరంగా గళం వినిపిస్తున్నామని  తెలిపారు. ప్రజల హక్కులు కాపాడటమే తమ లక్ష్యం అని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు చెప్పారు. మే నెలలోనే ఈ సమస్యను కలెక్టర్, ఆర్డీఓ  దృష్టికి తీసుకెళ్లి,తగిన ఆదేశాలు సాధించగలిగామన్నారు. ఆ కృషి ఫలితంగానే నేడు అధికారికంగా చర్యలు తీసుకొని రిసర్వే చేశారు అని తెలిపారు. రిసర్వే లో ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఖాసిం వలి, మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నూర్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. మొదటిసారిగా పత్తికొండలోని ప్రభుత్వ స్థలాలైన సర్వే నంబర్ 95 వాగు మరియు 710 గయ్యాల భూముల సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు రీ-సర్వే చేశారని తెలిపారు. ఆక్రమణ, కబ్జా చేసిన వారికి నోటీస్లు ఇచ్చి త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరమన్నారు. లేని పక్షంలో ప్రభుత్వ భూముల రక్షణ, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు.

About Author