NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డబ్ల్యూటిఐటిసి ఇల్లినాయిస్ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షుడిగా రామకోటేశ్వర రెడ్డి వీరంరెడ్డి నియామకం

1 min read

హైదరాబాద్/చికాగో : WTITC ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి‌ (WTITC) అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలో ఆ సంస్థ చికాగోలోని ప్రముఖ టెక్ నేత రామకొటేశ్వర రెడ్డి వీరంరెడ్డి ని ఇల్లినాయిస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడాన్ని ప్రకటించింది. ఈ నియామకం WTITC యొక్క గ్లోబల్ మిషన్‌కు బలాన్ని చేకూర్చడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు టెక్ నిపుణులకు శక్తి కల్పించడానికీ దోహదపడుతుంది. ఈ సందర్భంగా  WTITC అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. “విజన్, అంతర్జాతీయ అనుభవం కలిగిన రామకొటేశ్వర రెడ్డి నాయకత్వం WTITC మిషన్‌ను అమెరికాలో మరింత ముందుకు తీసుకెళ్లుతుంది. మధ్య పశ్చిమ ప్రాంతాల్లో తెలుగు టెక్ నిపుణులతో అనుసంధానాన్ని పెంచడం, సహకారం, ఇన్నోవేషన్, వృద్ధి కోసం కొత్త అవకాశాలు పొందడం మెరుగవుతుందన్నారు. ఆ తరువాత  WTITC NRI (Texas, USA) జాయింట్ సెక్రటరీ డి. రామా రావు అభినందనలు తెలియజేశారు. రామకొటేశ్వర రెడ్డి వీరంరెడ్డి మాట్లాడుతూ “WTITC ఇల్లినాయిస్ అధ్యక్షుడిగా పనిచెయ్యడం గొప్ప గౌరవం. WTITC చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల, కౌన్సిల్ తన పై చూపిన అభిమానం అభినందించాల్సిందే. ఇల్లినాయిస్ లో తెలుగు IT కమ్యూనిటీని బలోపేతం చేయడంలో, ప్రపంచంతో కలిసికట్టుగా ముందుకు పోవడంలో, ఇన్నోవేషన్, ఇంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ప్రొఫెషనల్ గ్రోత్ లో అవకాశాలు కల్పించడంలో కలిసి పని చేస్తానన్నారు.

About Author