NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే

1 min read

ఆలూరు న్యూస్ నేడు: ప్రజలకు సాయం చేయడంలో ఆపద్బాంధవుడు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి   ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో  ఆగస్టు 20వ తేదీన  ప్రమాదవశాత్తు 5వ తరగతి చదువుతున 6 మంది విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందడం జరిగింది. ఆ 6మంది విద్యార్థుల కుటుంబాలకు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఒక్కో కుటుంబానికి 50,000 వేల రూపాయలు  చొప్పున సహాయం చేయడం జరిగింది. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ… ముందుగా 6 మంది విద్యార్థులకు సంతాపం తెలుపుతూ విద్యార్థుల కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అని అన్నారు . కుటమి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయడం కాని ప్రజలను చాలా చులకనగా చూస్తున్నారు. నేను స్వయానా జిల్లా కలెక్టర్ తో మాట్లాడితే జిల్లా కలెక్టర్  నాకు చెప్పింది ఏమంటే మేము అంతా రిపోర్ట్ పైకి పంపించాం అని అన్నారు తప్ప  ఇంతవరకు ఆ కుటుంబాలకు భరోసా కూడా ఇవ్వలేదు.. కూటమి ప్రభుత్వానికి మానవత్వం అనేది లేదు కుటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అనుకుంటున్నారు తప్ప , అవి ఏమాత్రం ప్రజలకు  అందలేదని వాళ్లకు తెలియడం లేదు. కూటమి ప్రభుత్వం ఆ 6 కుటుంబాలకు సహాయం చేసేంతవరకు  నేను పోరాడుతూనే ఉంటానని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  హామీ ఇచ్చారు . బాధిత కుటుంబాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ, అధికారులు కానీ మాకు ఇంతవరకు ఏ భరోసా ఇవ్వలేదని అని అన్నారు .వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అలాగే నేను కూడ అండగ ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author