NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలి..

1 min read

ఎంఎస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి..

మిడుతూరు, న్యూస్​ నేడు  : మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ బీటీ శ్రీదేవి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని బుధవారం మోడల్ పాఠశాలలో భారత స్కౌట్స్ మరియు గైడ్స్ జాతీయ శిక్షణ ‘పచ్ మార్హి’ దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలసి ప్రిన్సిపాల్ మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 1956 సెప్టెంబర్ 10న భారత స్కౌట్స్ మరియు గైడ్స్ జాతీయ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారని మొక్కలను నాటుతూ వాటిని కాపాడుకోవాలని పరిసరాలు పచ్చగా అందంగా ఉండటానికి  మొక్కలు దోహదం చేస్తాయని  వాతావరణ ఉష్ణోగ్రతలు క్రమబద్ధంగా ఉండటానికి సకాలంలో వర్షాలు రావడంతో సాయం చేస్తాయని చెట్లను మనం కాపాడుకోవాలని ప్రిన్సిపాల్ విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది శేఖర్,షర్మిల మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author