కొత్త స్తంభాలు పూడ్చిన వాటికి వెంటనే లైట్లు బిగించాలి
1 min read

హొళగుంద న్యూస్ నేడు: ఈ బీసీ కాలని, 4 వ వార్డు, రాళ్ల చేను నందు కొత్త కరెంట్ స్తంభాల కు లైట్ ల సమస్య గురించి హొళగుందమేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్, తనయుడు పంప కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కు ఈ బీసీ కాలని, నాలుగవ వార్డు, రాళ్ల చేను నందు కొత్త స్తంభాలు పూడ్చడం జరిగింది వాటికి ఇంతవరకు లైట్లు లేకపోవడం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది.అవసరమైన లైట్లు ఎక్కడంటే ఐ ఈ బీసీ కాలని, ముసా క్యాంప్ లో దాదాపు 25 లైట్లు వరకు వేయాల్సి ఉంది.2. నాలుగో వార్డులో ఇలాగే స్తంభాలు పూడ్చి లైట్లు వేయలేదు అక్కడ కూడా దాదాపు 15 లైట్లు3. రాళ్ళ చేనులో 15 లైట్లు వేయాల్సి ఉంది.4. లైట్లు వేయకపోవడం వలన రాత్రిపూట చీకట్లో చిన్న పిల్లలు, పెద్దలు బయట వస్తుంటారు విష పురుగులు తిరుగుతున్న సరే కనిపించకుండా పోతుంది బయటకు రావడానికి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఎస్డీపిఐ 6వ వార్డ్ బ్రాంచ్ యొక్క విన్నపం ఏమనగా కొత్త స్తంభాలు పూడ్చిన వాటికి వెంటనే లెట్లు బిగించి పలు కాలనెలలో వెలుగులు నింపాలని కోరుతున్నాముఈ కార్యక్రమంలో ఎస్డీపిఐ 6వ వార్డు బ్రాంచ్ ప్రెసిడెంట్కె. ఆరిఫ్, ముల్లా రహంతుల్లా, ఫాతిర్, సబూర్, కాలనివాసులు పాల్గొన్నారు.

