16న మిడుతూర్ మండల సర్వసభ్య సమావేశం..
1 min read

మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 16వ తేదీ మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ పి దశరథ రామయ్య బుధవారం సాయంత్రం తెలిపారు.16వ తేదీ ఉ 11 గంటలకు ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని అన్నారు. వివిధ శాఖల మండల అధికారులు ఈ నెల 15వ తేదీ లోపు తమ ప్రగతి నివేదికల ఐదు కాపీలను మండల పరిషత్ కార్యాలయంలో అందజేయాలని అదేవిధంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు జడ్పిటీసీ,మండల కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు,సర్పంచులు తదితర ప్రజా ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో పాల్గొనాలని ఎంపీడీవో కోరారు.

