ఇంజనీర్లుగా కాక ఇంజనీరింగ్ లీడర్స్ గా ఎదగాలి
1 min read

స్థానిక రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల మరియు
జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలు
కర్నూలు, న్యూస్ నేడు: ప్రధమ బీటెక్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఇండక్షన్ ప్రోగ్రాం లో భాగంగా పలు రంగాల్లో విశిష్టమైన సేవలందించి పేరు గడించిన వ్యక్తులతో విద్యార్థులకు ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐ.పీ.ఎస్ అధికారి జే.డీ. లక్ష్మీనారాయణ తో ఒక కార్యక్రమం నిర్వహించారు, ఆయన తన ఉపన్యాసంలో ‘ఇంజనీర్లుగా కాక ఇంజనీరింగ్ లీడర్స్ గా విద్యార్థినీ విద్యార్థులు ఎదగాలని’ ఉద్బాదించారు. నేటి విద్యార్థులు ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల పట్ల అతిగా ఆకర్షితులై తమ జీవితాన్ని తిరుగమనం వైపు పయనిస్తున్నారని అన్నారు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి పద్మశ్రీ మల్లేశం, మాంజీ లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తమ గురువు పూర్వ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేశారు మీరు చదివే కళాశాలకు మీరే ముఖ్యఅతిథిగా రావడం, మీ సంతకం ఒక ఆటోగ్రాఫ్ లాగా, మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడేలా చెయ్యాలి అన్న మాటలు గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు ప్రతిరోజు డైరీ రాసే అలవాటు, రోజు నేర్చుకున్న విషయాన్ని అందులో రాస్తే గణనీయమైన మార్పు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ కే.ఈ. శ్రీనివాసమూర్తి మరియు డాక్టర్. సి. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషశ్రీ, డీన్ అడ్మిన్ డాక్టర్ ఎం గిరిధర్ కుమార్, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ జి శశికుమార్ మరియు కళాశాలల విభాగాధిపతులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


