NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేసి చేతుల మీదుగా  పౌష్టికాహార మాసోత్సవాల పోస్టర్స్ విడుదల

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రతి సంవత్సరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్  నెలలో ప్రారంభమయ్యే  పౌష్టికాహార మాసోత్సవాల పోస్టర్లను సోమవారం  జిల్లా  కలెక్టర్  కార్యాలయంలో   జాయింట్ కలెక్టర్  శ్రీమతి   నవ్య గారి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ కార్యక్రమం  విద్యా,ఆరోగ్య  మరియు అగ్రికల్చర్, పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్ తదితర శాఖల జిల్లా అధికారుల  ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాల విజయవంతానికి పై శాఖల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు  పోషణ్ మా వేడుకలు జిల్లాలోని 1886 అంగన్వాడీ కేంద్రాల్లో  ఘనంగా జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్ లోని  దార్ లో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా  ఊబకాయాన్ని తగ్గించడం చక్కెర నూనె వినియోగాన్ని పరిష్కరించడం, బాల్య సంరక్షణ మరియు విద్య, ఒక మొక్క పేరు- పర్యావరణ స్థిరత్వం మరియు పోషకాహార తోటలు, శిశువులు చిన్నపిల్లలకు ఆహారం పెట్టే పద్ధతులు, పురుషుల స్ట్రీమింగ్, పోషకాహారం మరియు సంరక్షణలో పాల్గొనడం లాంటి ఈ ఐదు  థీమ్స్ లపై అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. చిన్న వయసు నుండే  పౌష్టికాహారం ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. జిల్లాలోని 9 ఐసిడిఎస్ ప్రాజెక్టులలో రకరకాల కార్యక్రమాల ద్వారా  అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో  లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో  పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author