NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల గుండెల్లో ఉదయించే సూరీడు సురవరం సుధాకరరెడ్డి

1 min read

నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం

ప్రజా సమస్యల పరిష్కారమే ఊపిరిగా ఉద్యమాలు

నిబద్ధతగల నేత ఆశయాలకు పునరంకితమవుదాం

సంస్కరణ సభలో వక్తలు పిలుపు

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురావరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభను కేర్ బజార్ లోని మంజునాథ మినీ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్మరణ సభకు సిపిఐ పట్టణ కార్యదర్శి జి.రంగన్న అధ్యక్షత వహించారు. సురవరం సుధాకర్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి ఊపిరి వరకు ఎర్రజెండ చేతబట్టి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు కొనసాగించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవడం జరిగిందని  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ  సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పి గిడ్డయ్య, సిపిఎం మండల కార్యదర్శి గోవిందు, కాంగ్రెస్ నాయకుడు కాసిం వలి, టిడిపి నాయకులు ఆదెన్న, ఆర్కే హాస్పిటల్ అధినేత హేమంత్ కుమార్ తెలిపారు.ముందుగా సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది.సురవరం సుధాకర్ రెడ్డి తెలంగాణలో జన్మించినప్పటికీ కర్నూలు లో ఉస్మానియా కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే విద్యారంగ సమస్యల పైన పోరాటాలను కొనసాగించడం జరిగిందని వారు గుర్తు చేశారు. కర్నూలు జిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఎనలేని కృషి చేయడం జరిగిందని, ప్రధానంగా 1994లో డోన్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పై పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగిందని, అనంతరం నలగొండ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి పార్లమెంట్ సభ్యులుగా గెలుపొంది పార్లమెంట్ లో ప్రజా గొంతుకై ప్రశ్నించే వారిని వారు గుర్తు చేశారు. సంస్మరణ సభలో మల్లెల జీవన్ సుశీల్,ఎస్టియు నాయకులు తిమ్మన్న,, ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు,జే ఐ హెచ్ పట్టణ అధ్యక్షుడు చాందు, సిపిఐ మాజీ నాయకులు మౌనయ్య, నిలకంఠప్ప,ఉరుకుందు,బజారి, జబ్బర్,దాదావలి,బడేసాబ్, యోహాన బక్కర్,ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, మల్లికార్జున,లక్ష్మన్న, వెంకటేష్, మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

About Author