NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించిన ఎంఈఓ..

1 min read

మిడుతూరు, న్యూస్​ నేడు: విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు స్వయంగా మిడుతూరు ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ విద్యార్థులతో మాట్లాడుతూ వారు సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని దేవనూరు గ్రామంలో ఉన్న పాఠశాలలను బుధవారం ఎంఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు.మండల పరిషత్ పాఠశాల,బాలుర మరియు బాలికల ఉర్దూ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా ఎస్ ఏఎంపి-1 అసెస్మెంట్ పుస్తకాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు తగు సూచనలు ఇచ్చారు.పిల్లల సామర్థ్యాలను పరిశీలించి పిల్లలకు గుణాత్మక విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ద్వారా నిర్వహించ బడుతున్న పిఏఎల్  ల్యాబ్ తనిఖీ చేసి, విద్యార్థులకు టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు ఎంఈఓ వివరించారు.తర్వాత పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం మరియు విద్య అందించాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు డి సుబ్రహ్మణ్యం,షకీరా బాను, గుల్జార్ బేగం పాల్గొన్నారు.

About Author