‘ పల్మనాలజి ’ పై విజ్ఞాన వ్యాప్తే లక్ష్యం..
1 min read

వ్యాధి నిర్ధారణ దశలో.. నయం చేసేందుకే.. ‘ లంగ్ నోడ్యూల్ క్లినిక్ ’
- ఆధునిక టెక్నాలజీ తో చికిత్స చేసే విధానం వెల్లడి
- హైటెక్ సిటీ యశోధ హాస్పిటల్స్ డాక్టర్ వి. నాగార్జున మాటూరు
- కర్నూలులో సీనియర్ పల్మనాలజిస్టు వైద్యులకు, పీజీ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు
- రీజియనల్ పల్మోనాలజీ అప్డేట్ 2025 – కర్నూలు
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు :గాలి..నీరు.. ఆహారం.. ఇలా అన్నీ కలుషితమవుతున్న నేపథ్యంలో… పల్మనరీ వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారని, కొందరు తీవ్ర అనారోగ్యంతో ఆర్థిక సమస్యల్లో కూరుకు పోగా.. మరికొందరు మృత్యువుకు చేరవుతున్నారని, ఇలాంటి క్రమంలో పల్మనరీ వ్యాధిగ్రస్తులను కాపాడేందుకు ఎప్పటికప్పుడు వైద్యరంగంలో ఆధునిక చికిత్స విధానం, టెక్నాలజీని వినియోగించాలని సూచించారు హైటెక్ సిటీ యశోధ హాస్పిటల్స్ డాక్టర్ వి. నాగార్జున మాటూరు. ఆదివారం నగరంలోని ఓ హోటల్ లో కర్నూలు రీజియన్ పల్మోనాలజి అప్ డేట్ –2025 సదస్సు జరిగింది. కార్యక్రమంలో సీనియర్ పల్మనాలజిస్టు వైద్యులకు, పీజీ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్మనాలజి సమస్యతో బాధ పడుతున్న రోగులకు చేసే చికిత్స విధానం, ఆధునిక పరికరాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశోధలతో వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. వి. నాగార్జున మాటూరు మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు పల్మనరీ వ్యాధి లక్షణాలు, చికిత్స చేసే హై టెక్ విధానం తదితర అంశాలు తెలియజేసేందుకు యశోధ హాస్పిటల్ యాజమాన్యం ముందుందన్నారు. ప్రస్తుతం కర్నూలులో నిర్వహించిన సదస్సులో 250 మంది పీజీ విద్యార్థులు, సీనియర్ పల్మనాజి వైద్యులు పాల్గొని.. కొత్తగా వ్యాపించే వ్యాధులకు చికిత్స చేసే విధానం గురించి స్పష్టంగా వివరించినట్లు పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ వెంకట్ రమణ కోలా మాట్లాడుతూ ‘ విజ్ఞానం అందరికీ అందించడం ’ లక్ష్యంతో కర్నూలులో నిర్వహించిన రీజియన్ పల్మోనాలజీ అప్డేట్ 2025 కు విశేష స్పందన లభించిందన్నారు. పల్మనరీ కేసులను వేగంగా నిర్ధారించి..నయం చేసేందుకు వినియోగించే హై టెక్నాలజీ, విధానాన్ని ప్రాక్టికల్ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు. కార్యక్రమానికి సీనియర్ పల్మోనాలజిస్టులు (డాక్టర్ కుల్లాయప్ప, డాక్టర్ ఎం శైలజ, డాక్టర్ సి. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ జి సుబ్బారావు, డాక్టర్ నెమలి రవి కుమార్ రెడ్డి, డాక్టర్ సుధీంద్ర, డాక్టర్ గంగాధర్ రెడ్డీ), వైద్యులు (డాక్టర్ మాలకొండయ్య) మరియు ఈ ప్రాంతానికి చెందిన ఇంటెన్సివిస్టులు (డాక్టర్ ఎస్ ఎన్ క్వాద్రి) హాజరరైనట్లు ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ రమణ కోలా విలేకరులకు తెలిపారు.



