ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
1 min read

ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు డీజే.సంపత రావు,వై.శిరీష్ కుమార్
అధ్యక్ష,కార్యదర్శులకు అభినందనలు తెలియజేసిన పలువురు ఉద్యోగులు
సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి,సంఘం బలోపేతానికి కృషి చేయాలి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం జిల్లా ట్రెజరీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.ఈ సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా డి.జె సంపతరావు (ఏటిఓ నూజివీడు) వై.శిరీష్ కుమార్ (ఎస్ఏ,ఏటిఏఓ ఏలూరు) మరియు ట్రెజరర్ గా వి. సురేష్ (ఎస్ఏ,డిటిఏఓ ఏలూరు) ఉపాధ్యక్షులు గా జి ఎన్ వి ప్రసాద్ (నాగేంద్ర,ఎస్ టిఓ,డిటిఏఓ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శులకు, సంఘ సభ్యులకు పలువురు ఉద్యోగులు శాలువా కప్పి పూల బొకేలు అందించి అభినందనలు తెలియజేశారు. సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని, సంఘం బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు.అధ్యక్ష, కార్యదర్శులకు సంఘానికి డి. కృష్ణంరాజు (ఏఎఫ్ఓ,డిసిహెచ్ ఎస్,ఏలూరు) ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

