NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్జీదారులతో స్వయంగా మాట్లాడి చక్కని పరిష్కారం చూపాలి

1 min read

పిజిఆర్ యస్ లో అందిన ప్రతి అర్జీని చాలెంజీగా తీసుకుని పరిష్కరిస్తే అర్జీదారులు సంతృప్తి చెందుతారు

ధరఖాస్తులు పరిష్కారంలో అలసత్వం,నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

పిజిఆర్ యస్ లో అందిన అర్జీలు 306

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు,నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాఫ్, సర్వే ఏడి అన్సారీలు అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మన దగ్గరకు వచ్చిన ఫిర్యాదుదారులతో ఆప్యాయతతో పలకరించి సమస్యలను పూర్తిగా విని చక్కని పరిష్కారం చూపాలని అన్నారు. పిజిఆర్ యస్ లో ప్రజలు సమర్పించిన అర్జీలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారులతో  స్వయంగా మాట్లాడి నాణ్యమైన  పరిష్కారాన్ని చూపాలన్నారు. గ్రామంలో రేషన్ డిపో ఖాళీ అయినది, ఆ రేషన్ డిపో మా డ్వాక్రా సంఘ గ్రూప్ కి కేటాయించాలని  కోరారు, ఏలూరు మండలం గోల్లాయిగూడెం చెందిన కాళ్ళ సుమప్రియ మా పిల్లలు ఇద్దరు ప్రవేటు కాన్వెంట్లో చదువుతున్నారు,పేదరికం వలన ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేసాను కాని ప్రవేటు స్కూల్లో డబ్బులు కడితేనే గాని టిసిలు ఇవ్వమని చెపుతున్నారని సమస్యను  పరిష్కారం చేయాలని అర్జీని సమర్పించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా  అధికారులు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author