NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐకమత్యంగా ఉద్యమిద్దాం…

1 min read

డిమాండ్స్ ను సాధించుకుందాం

దీర్ఘకాలిక సమస్యల సాధనకై దశలవారీ ఆందోళనా కార్యక్రమాలను జయప్రదం చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల,కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు   : విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై సోమవారం కలెక్టరేట్ వద్ద ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విద్యుత్ ఉద్యోగులు నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టారు, జిల్లా కార్యాలయం (విద్యుత్ భవన్) నుండి భారీ ఎత్తున ర్యాలీతో కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఉద్యోగ, కార్మిక సోదర సోదరీమణులారా.గత నాలుగైదేళ్ళుగా విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న విషయం మీకు విదితమే! కార్మిక సంఘాలు గతంలో ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల యాజమాన్యం కార్మిక చట్టాలకు మరియు విద్యుత్ బోర్డ్ విభజనకు ముందు ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా గత ఆరు దశాబ్దాల నుండి అమలులో వున్న సర్వీస్ నిబంధనలను ఏకపక్షంగా మార్పులు చేస్తున్నారు. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం బోర్డు విభజనకు ముందు అమలులో వున్న సర్వీస్ నిబంధనలు,పని ప్రమాణాలు, కారుణ్య నియామకాలు తదితర ప్రయోజనాలు యధావిధిగా కొనసాగుతాయని,ఏవైనా మార్పులు చేయాలంటే ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రస్తుత ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా పరస్పర అవగాహనతో ఒప్పందాలు చేయబడతాయని పేర్కొనడం జరిగినదన్నారు. అదే విధంగా జీతభత్యాల విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న పరస్పర చర్చల ద్వారా వేతనాలు నిర్ణయించే పద్ధతి ఇకముందు ఏర్పడబోయే సంస్థలలో కూడా కొనసాగించబడుతుందని త్రైపాక్షిక ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనడం జరిగినది. కాని ఇందుకు భిన్నంగా 2022 వేతన సవరణపై నిర్ణయాలు గైకొనుటకు మునుపెన్నడూ లేని విధంగా ఒక మాజీ ఐఏఎస్ అధికారిని నియమించారు. పూర్వం నుండి అమలులో ఉన్న “వెయిటేజ్’ ఫార్ములాను రద్దుచేసి, అతి తక్కువ శాతం (8%) ఫిట్మెంట్ బెనిఫిట్తోను, పాత పద్ధతికి విరుద్ధంగా ఇంక్రిమెంట్లు, మాస్టర్ స్కేలు రూపొందించారు. ఈ పద్ధతి వల్ల ఉద్యోగులు చాలా నష్టపోయారన్నారు.పై సమస్యలన్నిటిపైన యాజమాన్యాలతో పలుధపాలుగా చర్చించినప్పటికీ ఫలితం లేనందున, రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి దృష్టికి తెచ్చి, వారి సమక్షంలో జరిగిన చర్చలలో అంగీకరించిన విషయాలపై ఉత్తర్వులు జారీ చేయకుండా తీవ్ర కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను కూడా యాజమాన్యాలు అమలుచేయకపోవడంపై పలు సందేహాలకు తావిస్తోంది. అందువల్ల జేఏసీలో భాగస్వాములైన సంఘాలన్ని ఆగస్టు 24వ తేదీన సమావేశమై ముఖ్య సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ఈ క్రింది దశల వారి ఆందోళనా కార్యక్రమం రూపొందించబడినది. క్రింది కార్యక్రమాలను అందరం కలిసికట్టుగా అమలుచేసి యాజమాన్యంపై ఒత్తిడి తెద్దా మనీ పిలుపునిచ్చారు.

దశలవారీ ఆందోళనా కార్యక్రమాలు15.09.2025 } 16.09.2025నల్లబాడ్జీలు ధరించి విధులకు హాజరగుట.17.09.2025అన్ని సర్కిల్ ఆఫీసులు మరియు జనరేటింగ్ స్టేషన్ల ముందు18.09.2025 )భోజన విరామ సమయంలో ధర్నా,19.09.2025అన్ని సర్కిల్ ఆఫీసుల, జనరేటింగ్ స్టేషన్ల ముందు రిలే నిరాహార దీక్షలు.20.09.2025 |అన్ని జిల్లా కేంద్రాలలో శాంతియుత ర్యాలీ ద్వారా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పణ.22.09.2025అప్పటికి సమస్యలు పరిష్కారం కాని ఎడల తదుపరి కార్యాచరణ నిర్ణయించబడుతుందని విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఐక్యమత్యంతో హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విద్యుత్ ఉద్యోగులు,మహిళా ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

About Author