రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసిన ఎస్డీపిఐ నాయకులు
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద లో ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు హమీద్ మరియు కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆలూరు అసెంబ్లీ ఎఫ్ ,అధ్యక్షులు హమీద్ మాట్లాతూఎస్డీపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గౌరవనీయులైన శ్రీమతి నీలం సాహ్ని ను కలవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈవీఎం లతో ఎన్నికల నిర్వహణపై వివాదాస్పదంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసినదే, అయినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పార్టీల నాయకులలో ఉత్ఖంఠ నెలకొన్న సందర్భంలో ఎస్డీపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు స్పందించి ప్రజల అభిప్రాయం ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వివాదాస్పద ఈవీఎం లతో కాక బ్యాలెట్ విధానంతో పటిష్ట మైన భద్రతతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తో నిర్వహించిన భేటి లో చర్చించడం జరిగింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించి ఎన్నికలను ఈవిఎంలతో కాక బ్యాలెట్ తో పటిష్టంగా నిర్వహించాలని కోరడం జరిగింది దీనికి సానుకూలంగా స్పందిస్తూఈ విషయమై కమిటీ నందు చర్చిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (యస్ డి పి ఐ) రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు హాఫీస్ అతావుల్లా ఖాన్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గని పాల్గొన్నారు.



