గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి.. పిఎఫ్ అమలు చేయాలి
1 min read

:- ఎస్.ఎ. చిన్న రహిమాన్
ప్యాపిలి , న్యూస్ నేడు: రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు లొ భాగంగా బుధవారం ఎండిఓ కార్యాలయం ముందు నెట్టికల్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్మికులను ఉద్దేశించి సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు పో దొడ్డి. రామాంజనేయులు, ఎస్.ఎ. చిన్న రహిమాన్,సిఐటియు ఉపాధ్యక్షులు రంగస్వామి వాళ్ళు మాట్లాడుతూ చెత్తను తీసివేయడం శుభ్రం చేయడం ప్రజలు అంటు రోగాల బారిన పడకుండా నిత్యం సేవలందిస్తు గ్రామంలో నిత్యం ప్రజలకు ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నారు అన్నారు. కరుణ కష్ట కాలంలో ప్రాణాలు తెగించి సేవలు అందించినారున్నారు. ప్రజలకు రోగాలు అంటకుండా మురికి కాలువలు హాస్పిటల్స్ రోడ్లు డ్రైనేజీలు ప్రాణాలు లెక్క చేయకుండా శుభ్రం చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆలోచించి వేతనాలు పెంచాలని పిఎఫ్ అమలు చేయాలని అన్నారు. గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి అన్నారు. పై డిమాండ్లతో కూడిన వినతి పత్రం సూపర్డెంట్ వెంకటేశ్వర్లు కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిషన్ యూనియన్ నాయకులు ఇలియాజ్, గ్రామపంచాయతీ కార్మికులు నాగరాజు, రాము, మారెప్ప, కమ్మగిరి, ఈరమ్మ, ఆదిలక్ష్మి, ఓబులమ్మ, ఎం. ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు.

