ఘనంగా జాతీయ సేవా సమితి ఆవిర్భావ దినోత్సవం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా సమితి ఆవిర్భావ దినోత్సవం బుధవారం ను ఘనంగా ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ భావి భారతాన్ని నిర్ణయించవలసినది యువకులే. ప్రతి దేశ పురోభివృద్ధిలో విద్యార్థులు పాలుపంచుకుంటారు. విద్యార్థులు సంఘంలో భాగస్వాములే, కాబట్టి సంఘసేవ వాళ్ళకి బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా సంఘసేవ చేసే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన జయలక్ష్మి (కేవీర్ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మరియు క్లస్టర్ యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్,కర్నూల్) మాట్లాడుతూ గాంధీజీ జన్మించిన 100 సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా గాంధీజి సేవా స్ఫూర్తి తో జాతీయ సేవా సమితి ని 1969 సెప్టెంబర్ 24 న స్థాపించడం జరిగిందని విద్యార్థులు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ గా చేరడం వలన వారిలో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది, బృందంతో కలిసి పని చేయగలిగే చొరవ వస్తుంది,ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అని విద్యార్థులకి సూచించారు.సర్వజ్ఞ మూర్తి మాట్లాడుతూజాతీయ సేవా సమితి వాలంటీర్స్ గా పని చేయడం వలన సామాజిక రుగ్మతల పై ప్రజల కు అవగాహన కల్పించవచ్చని తెలిపారు.విద్యార్థులకి క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. సక్రెడ్ ప్యాపిలి ఏరియా కోఆర్డినేటర్ శివ శంకర్ తన సామాజిక చైతన్య గీతాలని పాడి విద్యార్థులను ఉత్సాహపరిచాడు.అనంతరం అతిధులని శాలువా పూల మాల తో వాలంటీర్స్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులురామకృష్ణయ్య,ఓబులేసు ,వెంకటరమణ, వెంకటేష్ ,మద్దిలేటి,ముస్తాక్శంకరయ్య,మురళి మోహన్ గౌడ్,సురేష్,వన్నూర్,మంజునాథ్,మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.


