NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆనందం

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆనందం దాయకంగా ఉన్నంతంగాముందుకు వెళ్ళుతు, కుటుంబం బలంగా ఉంటుందని  ప్యాపిలి వైద్యాధికారి డాక్టర్ రంగారెడ్డి,డాక్టర్. రాహుల్ పేర్కొన్నారు. ఈసందర్భంగా బుధవారం ప్యాపిలి పట్టణంలో ప్రభుత్వం ఆసుపత్రిలో  స్వస్థత నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ను నిర్వహంచారు. ముఖ్య అతిథిగా హాజరై నమాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాసులు  మాట్లాడుతూ వైద్యులు నిర్వహించే వైద్య పరీక్షలను మహిళలు అందరు చేయించు కోవాలని, వారి సూచనలు, సలహాలు పాటించి అందరు ఆరోగ్యం ఉండాలని తెలిపారు.డాక్టర్. హరిత   స్త్రీ వ్యాధి నిపుణులు మాట్లాడుతూ ఈ అవకాశం ను మహిళలు సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించు కొని చికిత్స తీసుకోవాలి అని తెలిపారు.   అనంతరం 104 మందికి  ఓ పి నిర్వహించి గర్భిణీస్త్రీ లకు, భాలింతలు, కిశోరి భాలికలకు, మహిళలకు రక్తహీనత, రక్తపోటు, మధుమేహము,  నోటి, రొమ్ము, సర్వేయికల్ కాన్సర్ వంటి  అసంక్రామిత వ్యాదుల పైన స్క్రీనింగ్ , వైద్య పరీక్షలు  నిర్వహించి చికిత్స అందించి రిఫరల్ చేయడం జరిగింది. టీకాలు వేయడం,ఎం సి పి కార్డు పంపిణీ చేశారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర గౌడు  కాన్సర్ లకు వైద్య పరీక్షలు చేయించు కొని ప్రాథమిక స్థాయి లో గుర్తిస్తే భాగతాయి అని, శరీరం పైన నొప్పి లేని గడ్డలు, నోటి లో మానని పుండ్లు, పొత్తి కడుపు నొప్పి ఉంటే వైద్యుల ను సంప్రదించాలని, టీకాలపైన, పోషకహారం పైన, పొగాకు ఉత్పత్తు లను వాడకూడదని అవగాహనా కల్పించారు.క్షయ వ్యాధి వారికి పోషకాహారం కిట్ అందచేసి కౌన్సిలింగ్ చేశారు.ఈ కార్యక్రమం లో డీ పి ఎం ఓ రామచంద్ర రెడ్డి,  సుమతీదేవి, మనోహర్ రెడ్డి,శ్రీనివాస్ కరీముల్లా, ఉపేంద్ర,ప్రసన్న, రోజా, మల్లికార్జున,ఎం ఎల్ ఎచ్ పి లు, ఏ ఎన్ ఎం లు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author