NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టెక్నికల్ అసిస్టెంట్ కు తప్పిన ప్రమాదం..

1 min read

ఆర్థిక సహాయం అందించిన ఎంపీడీఓ,ఏపీఓ

మిడుతూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు ఉపాధి హామీ పథకం కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఇజ్రాయేల్ రాజుకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదం తప్పింది.మంగళవారం సాయంత్రం మిడుతూరులో విధులు ముగించుకొని 6 గంటల పాములపాడు జెరూసలేం చర్చి దగ్గర రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంపై  ఉండగా కర్నూలు నుండి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బైక్ ను ఢీ కొట్టడంతో గాయపడిన టెక్నికల్ అసిస్టెంట్ ను కర్నూలు అమీలియో హాస్పిటల్ లో చేర్పించారు.విషయం తెలుసుకున్న ఎంపీడీవో దశరథ రామయ్య,ఏపీఓ నాగమ్మ,ఈసీ షబాన మరియు సిబ్బంది గురువారం సాయంత్రం 12 వేల రూ.ల ఆర్థిక సహాయాన్ని ఆయన భార్యకు అందజేశారు. టెక్నికల్ అసిస్టెంట్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఏలు సబిత,నాగేష్,ఉమేష్ శ్రీవాణి,శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

About Author