నాయక కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్స్ ఇవ్వాలి
1 min read

తాసిల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు
ఆమరణ నిరాహారదీక్ష కూడా వెనకాడబోమని డిమాండ్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా,కామవరపుకోట లో నాయక కులస్తులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఏడవ రోజు కూడా వందలాది మంది నాయక కులస్తులు పాల్గొని,నాయక క్యాస్ట్ కు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదివారం ఆఫీసులు సెలవైనాసరే సర్టిఫికెట్లు ఇచ్చే అంతవరకు నిరంతరం రిలే దీక్షలు కొనసాగిస్తూ, దుద్దరిల్లిలా నినాదాలు చేశారు. నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆర్థిక సహాయాన్ని అందించారు. వారికి మా సంఘం తరఫున కృతజ్ఞతలుతెలియజేస్తున్నమన్నరు. కొమరం భీం నాయక కులస్తుల సంఘం ఆధ్వర్యంలో ఏడు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు అంతా కూడా నిమ్మకు నీరేతున్నట్లు వ్యవహరిస్తున్నట్టు వాపోయారు. నాయక ఎస్టి సర్టిఫికెట్స్ ఇచ్చేలా చర్యలు చేయకపోతే ఐక్యమత్యంతో మేమంతా ఆమరణ నిరాహార దీక్షలకు వెనుకాడబోమని హెచ్చరించారు. కుటుంబ సభ్యులతో కూడా కూర్చుంటామని కొమరం భీం నాయక కులస్తులు సంఘం డిమాండ్ చేసింది.

