కార్యకర్తలకు అన్యాయం చేస్తే సహించేది లేదు
1 min read

మీది రెడ్ బుక్..మాది డిజిటల్ బుక్
డిజిటల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ సుధీర్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: కార్యకర్తలకు అన్యాయం చేసిన వారినీ ఎవ్వరినీ వదలి పెట్టబోమని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు.పట్టణంలో దేవీ నవరాత్రుల సందర్భంగాశ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో డాక్టర్ సుధీర్ పూజలు చేశారు.తర్వాత వీఐపీ కాలనీలో డాక్టర్ సుదీర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకునేందుకు మాజీ సీఎం జగన్ రెడ్ బుక్కు కు ధీటుగా డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారని కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఈ క్యూ ఆర్ కోడ్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే సమస్యలను స్వయంగా పార్టీ అధినేత జగన్ చూస్తారని అన్నారు.17 నెలల కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలపై అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని అంతేకాకుండా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారని అన్నారు.90 శాతం హామీలను అమలు చేయలేదని రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందని మోసపూరితమైన హామీలతో ప్రజలు మేల్కోవాలని ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారు ఎవరైనా సరే రిటైర్డ్ అయినా అధికారులను వదిలిపెట్టమని డాక్టర్ సుధీర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు పర్వత యుగంధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో జడ్పిటీసీ లు పర్వత యుగంధర్ రెడ్డి, సోమల సుధాకర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు మన్సూర్ అహ్మద్, నాయకులు పుల్యాల నాగిరెడ్డి, రమేష్ నాయుడు,తులసి రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి,జబ్బార్,నభి రసూల్ తదితరులు పాల్గొన్నారు.

