NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చర్మవ్యాధుల ఆసుపత్రి “ఆరా” ను ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి

1 min read

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలి

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్,ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : స్థానిక రామచంద్రరావుపేట లోని నూతనంగా ఏర్పాటుచేసిన  చిన్నపిల్లలు,చర్మవ్యాధులు ఆసుపత్రి ‘ఆరా’ క్లినిక్ ను ఆదివారం సాయంత్రం రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రారంభించారు.   వైద్య రంగంలో ఎప్పటికప్పడు వస్తున్న నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన సేవలందించాలని మంత్రి ఆసుపత్రి వైద్యులు డా:కొలుసు కళ్యాణ్,డా:దివ్య లకు మంత్రి సూచనలు చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మాట్లాడుతూ వైద్య సమయంలో ఆసుపత్రికి వచ్చే పేదరోగుల పట్ల సానుకూల దృక్పధంతో చికిత్స అందించాలని  వైద్య వృత్తికి వన్నె తెచ్చే విధంగా వైద్య సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంపీ మరియు మంత్రి పార్థసారధి ఆకాంక్షించారు. విచ్చేసిన అతిధులను పూల బొకేలు అందించి,శాలువా కప్పి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర పాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదబాబు,స్థానిక కార్పొరేటర్,రిటైర్డ్ ఐ.ఏ ఎస్.అధికారి బి.ఉదయలక్ష్మి , రిటైర్డ్ ఐ.పి.ఎస్.అధికారిబ్.వి. రమణ కుమార్,యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్, నగరంలోని పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రభృతులు పాల్గొన్నారు.

About Author