NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాల్మీకి భవన్ నిర్మాణం కోసం రూ.1 కోటి విరాళం: మంత్రి టీజీ భరత్

1 min read

కర్నూలులో వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి టీజీ భరత్

కర్నూలు, న్యూస్​ నేడు: వాల్మీకి భవన్ నిర్మాణం కోసం రూ.1 కోటి విరాళం ఇస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. కర్నూలులో వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకులకు ఎస్టీ హోదాకు సంబంధించి   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ విషయంపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ప్రస్తుతం డబల్ ఇంజన్ సర్కార్ ఉన్నందున ఇందుకోసం ముఖ్యమంత్రి కృషి ఫలించి, సానుకూల ఫలితాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వాల్మీకి భవన నిర్మాణానికి తన వంతుగా అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు. కాపు భవన్ , బీసీ భవన్ ల నిర్మాణానికి కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించడం జరిగిందని, అదేవిధంగా వాల్మీకి భవన్ కు ఒక కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు పదివేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు వస్తున్నాయని, కావున యువత నిరాశ చెందకుండా మంచి శిక్షణ పొంది అక్కడ వచ్చే పరిశ్రమలలో ఉద్యోగాలు సాధించాలని విజ్ఞప్తి చేశారు. వాల్మీకి యువత ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆయన చెప్పారు.

About Author