NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వృద్ధుల పోషణ విస్మరించిన వారిపై జరిమానా, జైలుశిక్ష

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రైస్ ఫాతిమా   మంగళవారం నాడు అక్టోబర్ 1 న ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని  పురస్కరించుకొని ఏడవ తారీఖున మంగళవారం కర్నూలు నందు గల జిల్లా హార్టికల్చర్ మీటింగ్ హాల్ నందు ఏర్పాటుచేసిన సదస్సు కు ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు,  జిల్లా కో ఆర్డినేటర్ హాస్పటల్ సర్వీసెస్  జఫ్రుల్లా హాజరయ్యారు. గౌరవ జిల్లా న్యాయ సేవాది కార సంస్థ కార్య దర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి  మాట్లడుతూ ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపబడుతున్న దని తెలిపారు.  ఆర్థికంగా స్థిరమైన వారు కూడా కుటుంబ నిర్లక్ష్యం, పిల్లల నిరాదరణ, ఆస్తుల కోసం వేధింపులు, శారీరక బలహీనతను ఆసరాగా చేసుకున్న దాడులు వంటి బాధాకర పరిస్థితులు ఎదుర్కొంటున్నా రన్నారు.క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) – సెక్షన్ 125 క్రింద తల్లిదండ్రులు కోర్టులో కేసు వేసి పిల్లల నుండి జీవనభృతి పొందే అవకాశం కలదని తెలిపారు. న్యాయ  చట్టపరమైన సమస్యలు ఉంటే న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి ఉచితంగా న్యాయాన్ని పొందవచ్చునని తెలిపారు. వృద్ధులకు ఎవరికైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 15100 కాల్ చేస్తే వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం జడ్జి గారు వృద్ధులకు సంక్షేమ శాఖ వారి నుండి అందించిన బెడ్ షీట్లను అందజేశారు.

About Author