NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ  కోర్టు ద్వారా వైద్యులకి ఎంతో ఉపయోగకరం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఈ.  కోర్టు ను ప్రారంభించిన డా. ఎన్.టీ.ఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డా . చంద్రశేఖర్.. ఈ  కోర్టు ద్వారా వైదులకి  ఎంతో ఉపయోగకరం అని దీని ద్వారా వైద్యులకు ఎంతో  సమయం అదా అవుతుందని పని చేసే ప్రదేశం నుండే  రాష్ట్రం  లోని  ఏ  కోర్టు కు అయిన ఇక్కడి నుండే ఈ కోర్టు ద్వారా మెడికల్ ఎవిడెన్స్  అందించే చక్కటి అవకాశం దీని ద్వారా లభించంది అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డా.పి.చంద్రశేఖర్ తెలిపారు. గురువారం కర్నూలు మెడికల్ యందు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి ఈ కోర్టును హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ ఈ వ్యవస్థ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో పని చేస్తున్న వైద్యులు మరియు సిబ్బంది ప్రభుత్వ సంబంధిత కోర్టు కేసులలో వారి సాక్షాన్ని ఇక్కడి నుండే రాష్ట్రంలో ఏ కోర్టుకైనా ఇవ్వవచ్చునని దీని ద్వారా సమయం మరియు డబ్బు ఆదా అవుతాయి. మరియు అందరికీ చాలా వెసులుబాటు కలుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.డి.యం.ఇ & మెడికల్ కాలేజి  ప్రిన్సిపాల్డా. చిట్టి నర్సమ్మ , వైస్ ప్రిన్సిపల్స్  డా. రేణుక  మరియు డా. సాయి సుధీర్ , ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డా. బ్రహ్మాజీ , డా. సుధకుమారి , వైద్యులు డా. నాగార్జున, డా. కోటేశ్వర రావ, డా. హరీష్ కుమార్, డా. సురేఖ, డా. సాహిల్, పిజీ విద్యార్థులు మరియు ఆఫీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author