ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇవ్వాలి
1 min read

ఆడ పిల్లలకి ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించాలి
సమాజంలో ఆడపిల్ల, మగపిల్ల వాడు అనే వివక్ష ఉండకూడదు
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, అక్టోబర్ 18: ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇవ్వాలన్నారు.శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలికా విద్య ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. అక్షరాస్యత రేటు కూడా 100% ఉండాల్సింది జిల్లాలో 56 శాతమే ఉందన్నారు. అక్షరాస్యత రేటు 100 శాతం తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.. ఆడపిల్ల పుట్టిన మగపిల్లాడు పుట్టిన ఇద్దరు సమానమేనని ఆడపిల్ల ఎప్పుడు భారం అనుకోకూడదని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ గా, శాసనసభ్యులుగా, జిల్లా అధికారులుగా ఎక్కువ శాతం ఆడపిల్లలే ఉన్నారన్నారు. ఆడపిల్లలను బాగా చదివించడంతోపాటు పౌష్టికాహారం బాగా పెట్టాలని కలెక్టర్ తెలిపారు. ఇళ్లల్లో కూడా ఆడపిల్ల, మగ పిల్లవాడు అనే వివక్ష ఎప్పుడు చూపించకూడదన్నారు.. తన చిన్ననాటి స్నేహితురాలు 1990 కాలంలో అమెరికాకి తన స్నేహితురాలని పంపించి చదివిపించారని ఇప్పుడు తన ఉన్నత స్థానంలో ఉందన్నారు.కార్యక్రమం అనంతరం నాటకం, డాన్స్ వేసిన చిన్నారులకు కలెక్టర్ పాణ్యం ఎమ్మెల్యే బహుమానాలు అందజేశారు.కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ, డీఎంహెచ్వో డా. శాంతి కళా, సిపిఓ భారతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ జుబేదాబేగం, సెక్సువలీ హరాస్మెంట్ కమిటీ చైర్ పర్సన్ మాధవి శ్యామల, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు .


