NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

1 min read

వెలుగోడు, న్యూస్​ నేడు: మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి  ఆదేశాల మేరకు  గ్రామాల్లో కోటి సంతకాలు సేకరణ  కార్యక్రమంలో పేదలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో, అలాగే పేద విద్యార్థులకు ఉచిత వైద్యవిద్య అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నాలను వైయస్ఆర్ సీపీ బలంగా వ్యతిరేకిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  పిలుపుతో, ప్రజల ఆరోగ్యం–విద్యను కాపాడే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి   పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో వెలుగోడు మండలం వెలుగోడు పట్టణం 116 బూతులో, బూత్ ఇన్చార్జిలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author